శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం
**శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నమః**
Video link :
నా వెబ్‌సైట్‌కి స్వాగతం.
ఈ బ్లాగులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలో వివరిస్తున్నాను.
అనారోగ్య బాధలు, అప్పుల బాధలు మన దరిచేరకుండె, కాపాడే స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి.
వివాహం కావాలి, లేదా కోరుకున్న పనులు నెరవేర్చాలి అన్నా, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే, ఆయన తప్పక నెరవేర్చిస్తారు.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కవిడి అంటే భక్తులు అంటే ఎంతో ఇష్టం. అలాగే, అయ్యప్ప స్వామి వారికి ఇరుముడి ఉండగా, సుబ్రహ్మణ్య స్వామి వారికి కవిడి అలంకారంగా ఉంటుంది.
భక్తిశ్రద్ధలతో కవిడి స్వామి వారికి సమర్పిస్తే, మన కోరికలు వెంటనే నెరవేరతాయి.
**కవిడికి కావాల్సిన పూజా సామగ్రి:**
1. పూలమాల
2. కొబ్బరికాయ
3. అక్కు, వక్క (2 సెట్లు)
4. పసుపు, కుంకుమ (2 సెట్లు, ఇద్దరి అమ్మవార్లకి)
5. పండ్లు
6. విభూది
7. నిమ్మకాయ
8. కర్పూరం
9. గంధం
**పూజా విధానం:**
ముందు రోజు లేదా తెల్లవారు జామున స్నానం చేసి, పారిశుభ్రంగా ఉండాలి. తరువాత, కవిడి కర్ర, బుట్టలు నీళ్లతో కడిగి శుద్ధి చేయాలి.
కవిడి సంచులు మరియు మనం ధరించే తెల్లని వస్త్రాలు పసుపు నీళ్లలో ముంచి, ఆరపెట్టుకోవాలి.
**పూజా విధానం:**
1. కవిడి కర్రను వదిలి పాలను, నీటితో అభిషేకం చేయండి.
2. అభిషేకం తరువాత, కవిడి కర్రకి పసుపు రాశి, బుట్టలు, కవిడి సంచులు, కవిడి కర్రకు విభూధి, గంధం, కుంకుమతో బొట్లు పెట్టండి.
3. తరువాత, పూలతో కవిని అలంకరించండి.
4. 1వ బుట్టలో అక్కు, వక్క, పండ్లు, పూలమాల పెట్టండి. 2వ బుట్టలో మిగిలిన వస్తువులు పెట్టండి.
5. ఈ విధంగా కవిడి అలంకరణ పూర్తవుతుంది.
6. తరువాత, కవిని, దరించవలసిన బట్టలు స్వామి వారి దగ్గర ఉంచి, మనకు తోచినట్లు ప్రసాదం చేయండి.
7. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి, స్వామి దగ్గర చేసిన ప్రసాదం స్వీకరించండి.
8. కవిడిని తీసుకెళ్లి, గుడిలో స్వామి వారికి సమర్పించండి.
ఈ పూజా విధానం మొత్తం వీడియో రూపంలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసాము.
Video link:
Instgram link: https://www.instagram.com/follow_avachu_kadha/profilecard/?igsh=dzd6cXRhbjYxZXc5
Facebook Link: https://www.facebook.com/profile.php?id=100090970772023
Telegram Link: https://t.me/jayakaumar
Telegram Deals Link: https://t.me/Happyshopping9700
మీకు ఈ పూజా విధానంలో ఎటువంటి సందేహాలు ఉంటే, దయచేసి వీడియో కింద కామెంట్ చేయండి లేదా మమ్మల్ని సంప్రదించండి:
**hintelishbuzz@gmail.com**
Comments
Post a Comment