శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం
**శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నమః** Video link : నా వెబ్‌సైట్‌కి స్వాగతం. ఈ బ్లాగులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలో వివరిస్తున్నాను. అనారోగ్య బాధలు, అప్పుల బాధలు మన దరిచేరకుండె, కాపాడే స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. వివాహం కావాలి, లేదా కోరుకున్న పనులు నెరవేర్చాలి అన్నా, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే, ఆయన తప్పక నెరవేర్చిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కవిడి అంటే భక్తులు అంటే ఎంతో ఇష్టం. అలాగే, అయ్యప్ప స్వామి వారికి ఇరుముడి ఉండగా, సుబ్రహ్మణ్య స్వామి వారికి కవిడి అలంకారంగా ఉంటుంది. భక్తిశ్రద్ధలతో కవిడి స్వామి వారికి సమర్పిస్తే, మన కోరికలు వెంటనే నెరవేరతాయి. **కవిడికి కావాల్సిన పూజా సామగ్రి:** 1. పూలమాల 2. కొబ్బరికాయ 3. అక్కు, వక్క (2 సెట్లు) 4. పసుపు, కుంకుమ (2 సెట్లు, ఇద్దరి అమ్మవార్లకి) 5. పండ్లు 6. విభూది 7. నిమ్మకాయ 8. కర్పూరం 9. గంధం **పూజా విధానం:** ముందు రోజు లేదా తెల్లవారు జామ...